2007 సాహిత్య సింహావలోకనం: కవిత

2007లో వచ్చిన తెలుగు కథ గురించి గతవారం ముచ్చటించుకున్నాం. ఇప్పుడు 2007 ఏడాదిలో వెలువడిన కవిత గురించి ముచ్చటించుకుందాం.  రవిగాంచని చోటకూడా తెలుగు కవిగాంచున్ అని మరోమారు మన తెలుగు కవులు నిరూపించారు. books01సద్దాం హుస్సేనును ఉరితీస్తే మూడు నెలల్లోగా ‘సదా సద్దాం’ పేరుతో కవితా సంకలనం వెలువరించిన కవులు ఈ ఏడాది అంతే చురుగ్గా ప్రతిస్పందించారు. హైదరాబాద్ మక్కామసీదులో జరిగిన పేలుళ్లు, గోకుల్చాట్, లుంబినీపార్కుల్లో ముష్కరమూకలు జరిపిన భీతావహ దాడులు, పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వ నిర్వాకం ఫలితంగా చోటుచేసుకున్న ముదిగొండ కాల్పుల దుర్ఘటనలు కూడా భావుకుడైన తెలుగుకవిని కలచివేసి మానవీయ కవితలను వెలువరింపచేసాయి. వరవరరావు ‘మక్కామసీదుగాలి ‘, సయ్యద్ సాబిర్ హుస్సేన్ ‘పావురాన్ని బతికించుకుందాం’, బి.సత్యనారాయణ ‘ముదిగొండ మృత్యుఘోష ‘, అన్నవరం దేవేందర్ ‘ముదిగొండ రక్తకన్నీరు ‘,ఎండ్లూరి ‘ముదిగొండ మదరిండియా’ తుల్లిమిల్లి విల్సన్ సుధాకర్ ‘థాంక్ గాడ్ మేమక్కడలేం’, రామాచంద్రమౌళి ‘దిష్టాంగఛేదన ‘కవితలు రక్తసిక్త తెలుగు నేలను బాధాతప్త హృదయంతో పరామర్శించాయి. భీతావహ దాడుల వెనుకనున్న పైశాచిక మనస్తత్వాన్ని చీల్చిచెండాడాయి. 

అవికాక మిగతా విషయాలపై చింతా అప్పలనాయుడు ‘సిలబస్ ‘, చాయరాజ్ ‘పరీక్షల ఫలితాలు ‘, పి.మల్లిఖార్జున్ ‘యుక్త నెలవంక ‘, అరసవిల్లి కృష్ణ ‘నేటిగీత ‘, ఎ.కరీముల్లా ‘ప్రమోషన్ ‘, బండ్ల మాధవరావు ‘మారణహోమం’ కవితలు చదివిన చాలాకాలం తర్వాతకూడా గుర్తున్న కవితలు.

books02కవిత్వ సంపుటాలు, సంకలనాల విషయానికొస్తే ఇందిర కొల్లి తన కవితలను ‘ఆశ నా ఆధార రేఖ ‘గా ఈ ఏడాది వెలువరించారు. నానీల సృష్టికర్త ఎన్.గోపి భార్య ఎన్.అరుణ ‘అమ్మ ఒక మనిషి ‘కవితా సంపుటిని ప్రచురించారు. కదిరె కృష్ణ ‘బలగం’ కవిత్వంతో, దాట్ల దేవదానం రాజు ‘నది చుట్టూ నేను ‘తో, వి.ఆర్.శర్మ ‘మావూరి మట్టివాసన ‘తో, డి.శ్యామల ‘వేరు నా పేరు ‘తో, వై.సూర్యారావు ‘తల్లి గోదావరి ‘తో, తాళ్ళూరు లాభన్ బాబు ‘మేకులు కొట్టిన గోడ ‘తో, సత్యభాస్కర్ ‘ప్రతీక్ష ‘తో, చంద్ ‘దీపాలు ‘తో, జె.గౌతం ‘నలుదిక్కుల నుండి ‘తో, సరిగొండ నరసిమ్హరాజు ‘విధ్వంసక ముఖచిత్రం’తో నోస్టాల్జియ అనండి, డయాస్పోరా అనండి, మరింకేదైనా అనండి మనం మర్చిపోతున్న మహనీయ మానవ విలువలను మనోహరంగా మనకొకమారు గుర్తు చేయడానికి ప్రయత్నం చేసారు. నిజానికి కవిత్వ రచన పరమార్థమదే కదా!

3 స్పందనలు నుండి “2007 సాహిత్య సింహావలోకనం: కవిత” కు


  1. 1 విజయ భాస్కర్ తుర్లపాటి 10:14 పూర్వాహ్నం వద్ద ఫిబ్రవరి 8, 2008

    అంతా బాగుంది..కానీ చిత్రం లో మాత్రం ఆంగ్ల పుస్తకాలు దర్సనమిస్తున్నాయేమిటి చెప్మా???

  2. 2 koresh 2:22 అపరాహ్నం వద్ద ఏప్రియల్ 9, 2008

    mana vaalu utti vedavayiloy annattu, isala nidalo nijaalu telusukokunda fashionable rachaithalu edo raasthunnaru vaama pakshulu prachurinchesthunataru. ee rachaithallo chaala mandiki saddam hussain communist party ni ban chesaadani telidu, saddaam hussain kuli poina taruvaatha after 15 years of ban coomunist magazine print kaabadindi, atanini sakkalakettu koni mossethunnaru commies kaabatti rachaitha laara manchi gurinchi maana vathawam gurinchi sama bhavam tho raayandi

  3. 3 bollojubaba 9:38 పూర్వాహ్నం వద్ద జులై 10, 2008

    మీ సమీక్ష చాలా బాగుంది.
    మిస్ అయిన వాటిని ఇక వెతుక్కోవాలి.
    బొల్లోజు బాబా


ప్రత్యుత్తరమిమ్ము




Blog Stats

  • 1,048 hits

a

 

ఫిబ్రవరి 2008
సో మం బు గు శు
« జన    
 123
45678910
11121314151617
18192021222324
2526272829  

Flickr Photos

acceptance

Cardiac

310/365 November 6, 2009

More Photos