2007లో వచ్చిన తెలుగు కథ గురించి గతవారం ముచ్చటించుకున్నాం. ఇప్పుడు 2007 ఏడాదిలో వెలువడిన కవిత గురించి ముచ్చటించుకుందాం. రవిగాంచని చోటకూడా తెలుగు కవిగాంచున్ అని మరోమారు మన తెలుగు కవులు నిరూపించారు.
సద్దాం హుస్సేనును ఉరితీస్తే మూడు నెలల్లోగా ‘సదా సద్దాం’ పేరుతో కవితా సంకలనం వెలువరించిన కవులు ఈ ఏడాది అంతే చురుగ్గా ప్రతిస్పందించారు. హైదరాబాద్ మక్కామసీదులో జరిగిన పేలుళ్లు, గోకుల్చాట్, లుంబినీపార్కుల్లో ముష్కరమూకలు జరిపిన భీతావహ దాడులు, పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వ నిర్వాకం ఫలితంగా చోటుచేసుకున్న ముదిగొండ కాల్పుల దుర్ఘటనలు కూడా భావుకుడైన తెలుగుకవిని కలచివేసి మానవీయ కవితలను వెలువరింపచేసాయి. చదవుట కొనసాగించు ‘2007 సాహిత్య సింహావలోకనం: కవిత’
ఇటీవలి అభిప్రాయములు