ఫిడల్ కాస్ట్రో : నేనెలా కమ్యూనిస్టు నయ్యానంటే…

ఫిడల్ కాస్ట్రో  మనం కాస్ట్రో అని పిలుచుకునే క్యూబా అధ్యక్షుడి పూర్తి పేరు ఫిదల్ అలెజాంద్రో కేస్త్రో రజ్. 1959లో ఫల్జెనిషొ బతిస్తాను విప్లవ పోరాటం ద్వారా తొలగించి క్యూబాలో కమ్యూనిస్ట్ పాలనను ఏర్పాటుచేశాడు. అమెరికా అగ్రవాద దురహంకారానికి ఎదురునిలిచి పోరాడుతున్న వీరుడు. తానెలకమ్యూనిస్టుగా మారిందీ యూనివర్శిటీ విద్యార్థులతో ముచ్చటించినపుడు చెప్పిన విశేషాలను ఇక్కడ తెలుగు చేస్తున్నాను. చదవండి. తప్పులు చెప్పండి….

ఫిడల్ కాస్ట్రో  

నేనెలా కమ్యూనిస్టు నయ్యానంటే

            1871 నవంబర్ 18 తేదీన చిలీలోని కాన్సెప్షన్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో జరిగిన ప్రశ్నలు-జవాబులు నుంచి తయారుచేసిన వ్యాసమిది.

 నేనొక భూస్వామి కొడుకునిఅదే నేనో విప్లవకారునిగా తయారవ్వడానికి కారణం. ధనికుల పిల్లలు చదివే మతపరమైన పాఠశాలలో నేను చదువుకుననానువిప్లవకారున్ని కావడానికి మరో కారణమిది. అన్ని సినిమాలు, ప్రచురణలు, టీవీ పేపర్లు లాంటి మాస్ మీడియా అంతామేడిన్ అమెరికాఅని చెప్పుకోదగిన క్యూబాలో నేను నివశించేవాడినిఇది మూడో కారణం. పదిహేను వేలమంది చదువుకునే యూనివర్శిటీలో కేవలం ముప్పై మంది మాత్రమే సామ్రాజ్య వాద వ్యతిరేకులుంటే చివరి ముప్పైవ వాడిని నేను. నేను యూనివర్శిటీలో అడుగుపెట్టడం ఒక భూస్వామి కొడుకుగాఇంకా చెప్పాలంటే దరిద్రంగా ఒక రాజకీయ నిరక్షరాస్యునిగా!

ఒక్కటి గుర్తుంచుకోండి. పార్టీ సభ్యుడు గాని, కమ్యూనిస్ట్ గాని, సామ్యవాది గాని, లేదా మరే ఇతర అతివాది గాని నన్ను పట్టుకోలేదు, నాకే సిద్ధాంతమూ బోధించలేదు. లేదంటే నమ్మండి. నాకో పెద్ద, బరువైన, చదవశక్యంకాని, అర్థంకాని, భరింపశక్యంకాని పాఠ్య పుస్తకమొకటి ఇచ్చారు. పుస్తకం బూర్జువా దృష్టికోణంలో రాజకీయ ఆర్థిక విషయాలను వివరించే ప్రయత్నం చేసేదిదాన్నే వాళ్లు రాజకీయ ఆర్థిక శాస్త్రమని పిలిచేవాళ్లు!

అధికోత్పత్తి వల్ల వచ్చే సంక్షోభాలు, తదితర సమస్యలు ప్రపంచంలో సర్వసామాన్యం అన్నట్టు భరింపశక్యంకాని పుస్తకం బోధించేది. ఒకసారి బ్రిటన్ లో ఇబ్బడిముబ్బడిగా బొగ్గు లభించినపుడు ఏం జరిగిందో వివరించేది. కార్మికుల వద్ద బొగ్గు ముక్క ఉండేది కాదు. అయితే మార్చలేని, మార్చశక్యంకాని చారిత్రక, సాంఘిక, ప్రకృతి నియమాలవల్ల అధికోత్పత్తి తప్పదని, పరిస్థితుల్లో నిరుద్యోగం, ఆకలిచావులు తప్పవని పుస్తక వివరణ. బొగ్గు ఎక్కువైతేనట కార్మికులకు పని దొరకదట, ఆకలితో చచ్చిపోతారట. హతవిధీ!

అలా భూస్వామి కొడుకు, బూర్జువా స్కూల్లో చదువుకుని అమెరికా ప్రచారంలో పెరిగిన వాడు, వ్యవస్థలోనే ఏదో లోపముందని ఆలోచించడం ప్రారంభించాడు. అది అర్థం లేనిదని అనుకోసాగాడు

ధనికుడిగా మారిన ఒక పేదవాని కడుపున పుట్టిన నాకు కనీసం పల్లెటూరిలో పెరగగలిగిన అవకాశం, బీదలతోను, రైతులతోను స్నేహంగా మెలగ గలిగిన వీలు దొరికాయి. అదే మా తాత ధనిక భూస్వామి అయ్యుంటే మా నాన్న పట్నానికి పట్టుకుపోయి, ధనికులతోనే సహవాసం చేసుండేవాడిని. అప్పుడు సానుకూల అలోచనలు వచ్చే అవకాశం ఉండేదికాదేమో. అహంకారంలాంటి మానవ సహజ వ్యతిరేక భావాలు అబ్బేవేమో.

అదృష్టవశాత్తు నేను చదువుకున్న పాఠశాలలు కొన్ని సానుకూల భావాలు నేర్పాయి. కొంత ఆదర్శాత్మక హేతుబద్దత, మంచి చెడులనే భావన కొంత, న్యాయాన్యాయాల విచక్షణ, నిర్బంధం పీడనల పట్ల ఎదురు నిలిచే తిరుగుబాటు ధోరణి మొదలైనవన్ని మానవ సమాజం పట్ల విస్లేషణ కావించుకోవడానికి తోడ్పడ్డాయి. అవే తర్వాత నా అవగాహన మేరకు ఆదర్శ కమ్యూనిస్టుగా మార్చాయి. సమయానికి నాకింకా కమ్యూనిస్టును కలిసే, పార్టీ డాక్యుమెంట్ చదివే అదృష్టం కలగలేదు.

అనుకోకుండా ఒకరోజు కమ్యునిస్ట్ మేనిఫెస్టోప్రసిద్ధమైన కమ్యునిస్ట్ ప్రణాళికనా చేతుల్లోకి వచ్చింది. నేనెప్పటికీ మర్చిపోలేని కొన్ని సంగతులు చదివానుఏం మాటలు, ఏం నిజాలు? అందులోని నిజాల్ని ప్రతిరోజు కళ్లెదురుగా చూసేవాళ్లం.

అదంతా నాకెలా అనిపించిందంటే దుర్గమారణ్యంలో జన్మించి అయోమయంగా ఉన్న చిన్న జంతువులాగ అయ్యాను. అలాంటి స్థితిలో ఉన్న అతడికి అడవిలో దారులన్నీ వివరంగా విప్పిచెప్పే చిత్రపటం దొరికిందనుకోండి. ఒక పెద్ద పెన్నిధి దొరికిననట్లే భావించాను. మళ్లీ పరికించి చూడండిమార్క్స్ భావాలు, సరియైనవి కావా, న్యాయమైనవి కావా, ప్రేరణందించేవి కావా సరిచూసుకోండి. మన పోరాటానికి ఆలోచనలను ఆధారం చేసుకోకపోతే ఇప్పుడు మనమిక్కడ ఉండేవాళ్లం కాదు. ఇక్కడ ఉండేవాళ్లం కాదు.

సరే, నేనప్పుడు కమ్యూనిస్టునా? కానే కాదు. నేనప్పుడు ఒక రాజకీయ సిద్ధాంతాన్ని కనుగొన్న అదృష్టవంతుడ్ని మాత్రమే. ఒక పూర్తి స్థాయి కమ్యూనిస్టును కావడానికి చాలాముందు క్యూబా రాజకీయ సంక్షోభపు సుడిగుండంలో చిక్కుకుపోయిన వాణ్ణి మాత్రమే

దాన్నంతా అభివృద్ధి చేసుకుంటూ వచ్చాను. తర్వాత తర్వాత లెనిన్ పుస్తకంలో చెప్పినదానికన్నా సామ్రాజ్యవాద స్వభావం గురించి మరింత స్పష్టంగా తెలుసుకోగలిగాను. సామ్రాజ్యవాదం అన్నింటికంటే హేయమైంది, కౄరమైందివాస్తవాన్ని విపులంగా అర్థం చేసుకునే అవకాశం జీవితమిచ్చిందని భావిస్తున్నా. అదే నన్ను మరింత విప్లవకారునిగా, మరింత సామ్యవాదిగా, మరింత కమ్యూనిస్టుగా తీర్చిదిద్దింది

 

2 స్పందనలు నుండి “ఫిడల్ కాస్ట్రో : నేనెలా కమ్యూనిస్టు నయ్యానంటే…” కు


  1. 1 koresh 2:32 అపరాహ్నం వద్ద ఏప్రియల్ 9, 2008

    ayyana goppa vaade adarsha praayude, yodhaanu yodhude, kaani paarty lo kaarya karthala karuvu ella vachindi, swantha brother tappa vere leaderni edaga niyaleda… edaga ledaa , ekkado communism daari tappinanttu leduu…

  2. 2 devi prasada rao 4:03 అపరాహ్నం వద్ద జులై 26, 2008

    సమీక్షలో మీరు దర్శింపచేసిన ఫెడల్ క్యాస్ట్రొ గురించి నేనెలా కమ్యునిస్టునయ్యను…బాగుంది.సంక్షిప్తంగా మహొన్నుతుడైన కామ్రేడ్ గురించి మీరు విపులీకరించిన సమీక్ష నిజంగా విప్లవాత్మకంగా ఉంది.క్యాస్టో…ఆయన సాధించిన విజయాల గురించి మాత్రమే మాకు తెలుసు.ఆయన వ్యక్తిగత జీవితం గురించి నేను తెలుసుకోలేదు. నేను క్యాస్టొ అభిమానిని. మీ సమీక్ష చదివిన తర్వాత క్యాస్టో నాకు మరింత దగ్గరయ్యడు.


ప్రత్యుత్తరమిమ్ము




Blog Stats

  • 1,062 hits

a

 

డిసెంబరు 2007
సో మం బు గు శు
« నవం   జన »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

ఉత్తమ టపాలు

  • ఏమీ లేవు

Flickr Photos

iris

Neanche il suono del mare / Not even the sound of the sea

Sushi Tree

More Photos