2007 సాహిత్య సింహావలోకనం: కవిత

2007లో వచ్చిన తెలుగు కథ గురించి గతవారం ముచ్చటించుకున్నాం. ఇప్పుడు 2007 ఏడాదిలో వెలువడిన కవిత గురించి ముచ్చటించుకుందాం.  రవిగాంచని చోటకూడా తెలుగు కవిగాంచున్ అని మరోమారు మన తెలుగు కవులు నిరూపించారు. books01సద్దాం హుస్సేనును ఉరితీస్తే మూడు నెలల్లోగా ‘సదా సద్దాం’ పేరుతో కవితా సంకలనం వెలువరించిన కవులు ఈ ఏడాది అంతే చురుగ్గా ప్రతిస్పందించారు. హైదరాబాద్ మక్కామసీదులో జరిగిన పేలుళ్లు, గోకుల్చాట్, లుంబినీపార్కుల్లో ముష్కరమూకలు జరిపిన భీతావహ దాడులు, పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వ నిర్వాకం ఫలితంగా చోటుచేసుకున్న ముదిగొండ కాల్పుల దుర్ఘటనలు కూడా భావుకుడైన తెలుగుకవిని కలచివేసి మానవీయ కవితలను వెలువరింపచేసాయి. చదవుట కొనసాగించు ‘2007 సాహిత్య సింహావలోకనం: కవిత’

2007 సాహిత్య సింహావలోకనం – కథ

      book01వర్తమానానికి ఏడాది అంటే 365 రోజులు. పన్నెండు నెలలు. యాభై రెండు వారాలు. చరిత్రలో ఏడాది ఏమీకాని ఓ పుట. ఆధునిక యుగంలో ప్రతి క్షణమూ విలువైనదే. పూర్వం రోజుల్లో దశాబ్దాలు కూడా సాఫీగా సాగినట్టు చరిత్ర చెప్తోంది. కాని వర్తమానం గడ్డుకాలం. అప్పుడూ – ఇప్పుడూ – ఎప్పుడూ. ఏడాదిపాటు తెలుగులో వెలువడిన సాహిత్యాన్ని విహంగ వీక్షణం చేయడమనే దుస్సాహసం చేస్తున్నా. ప్రస్తుతం వెలువడుతున్న అన్ని దిన, వార, పక్ష, మాస పత్రికల్లో, వార్షిక ప్రత్యేక సంచికల్లో ఏడాదిపాటు వెలువడిన సాహిత్యాన్ని పరిమిత స్థలకాల వ్యవధుల్లో పరిశీలించబూనడం దుస్సాహసం కాక మరేమిటి? ఇదికాక పత్రికల పేజీలకెక్కకుండానే నేరుగా పుస్తకాలుగా వచ్చే సాహిత్యం; చదవుట కొనసాగించు ‘2007 సాహిత్య సింహావలోకనం – కథ’

యువత స్వప్న సాకారంలో సహకరించే మరో గొప్ప నవల

alchemist ఆత్మలన్నీ విశ్వాత్మలో అంతర్భాగమని, సృష్టిలో ప్రతిజీవీ ప్రతి వస్తువుఅసలువస్తువు ప్రతిరూపాలేనని చెప్పిన ఉపనిషత్ సారాన్ని కథ రూపంలో మలిచి పాశ్చాత్య నవలాకారుడొకడు చెప్తే గ్రంథాన్ని యావత్ ప్రపంచమంతా హృదయానికి హత్తుకుంది. లెఫ్ తొలుస్తొయ్ అనే ప్రఖ్యాత రష్యన్ రచయిత పలకడం రాని అమెరికన్ల నోట్లోపడి లియో టాల్ స్టాయ్ అయినట్లు లాటిన్ అమెరికన్ రచయిత పాలో కొయెల్ హొ కూడా పాల్ ఖెలో అయ్యాడు. అతను రాసిన నవలది ఆల్ఖెమిస్ట్ను వారం పరిచయం చేస్తున్నాను. చదవుట కొనసాగించు ‘యువత స్వప్న సాకారంలో సహకరించే మరో గొప్ప నవల’

ఫిడల్ కాస్ట్రో : నేనెలా కమ్యూనిస్టు నయ్యానంటే…

ఫిడల్ కాస్ట్రో  మనం కాస్ట్రో అని పిలుచుకునే క్యూబా అధ్యక్షుడి పూర్తి పేరు ఫిదల్ అలెజాంద్రో కేస్త్రో రజ్. 1959లో ఫల్జెనిషొ బతిస్తాను విప్లవ పోరాటం ద్వారా తొలగించి క్యూబాలో కమ్యూనిస్ట్ పాలనను ఏర్పాటుచేశాడు. అమెరికా అగ్రవాద దురహంకారానికి ఎదురునిలిచి పోరాడుతున్న వీరుడు. తానెలకమ్యూనిస్టుగా మారిందీ యూనివర్శిటీ విద్యార్థులతో ముచ్చటించినపుడు చెప్పిన విశేషాలను ఇక్కడ తెలుగు చేస్తున్నాను. చదవండి. తప్పులు చెప్పండి…. చదవుట కొనసాగించు ‘ఫిడల్ కాస్ట్రో : నేనెలా కమ్యూనిస్టు నయ్యానంటే…’

జాక్ లండన్ : నేనెలా సోషలిస్టును అయ్యానంటే…

చాలా కథలు, నవలలు రాసిన జాక్ లండన్ తెలుగు పాఠకులకు చాగంటి తులసిగారి పుణ్యమా అని ప్రకృతి పిలుపు రచయితగా సుపరిచితం. అమెరికన్ రచయిత జాక్ లండన్ తన ఇరవై మూడో యేట సోషలిస్టుగా ప్రకటించుకున్నాడు. చాలా స్పష్టంగా ప్రజల పక్షపాతం వహించిన లండన్ రచనలన్నీ ప్రగతిశీల భావాలు గల పాఠకులకు ఎంతో నచ్చుతాయి. తానెలా సోషలిస్టుగా మారిందీ తెలిపే వ్యాసపు అనువాదమిది. చదివి మీ అభిప్రాయం చెప్పండి. చదవుట కొనసాగించు ‘జాక్ లండన్ : నేనెలా సోషలిస్టును అయ్యానంటే…’

హెలెన్ కెల్లర్ : నేను సోషలిస్ట్ ను ఎలా అయ్యానంటే…

     చెవిటి మూగ కళ్ళు కనిపించని మహిళయిన హెలెన్ కెల్లర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కాలేజీలో గ్రాడ్యుయేట్ పట్టా పొందిన తొలి అంధ బాలిక ఈమె. అయితే చాలా మందికి తెలియనిది- ఆమె గొప్ప రచయిత్రి, విపరీతంగా ప్రయాణాలు చేసి మహిళల హక్కుల కోసం, ఓటు హక్కు కోసం పోరాడింది. ఇరవై మూడేళ్ల వయసులో రాసుకున్న ఆత్మ కథ ది స్టోరీ ఆఫ్ మై లైఫ్ (1903) చాలా ప్రసిద్ధి చెందింది. సోషలిస్ట్ భావాల  పట్ల ప్రేమ కలిగిన కెల్లర్ రాసిన వ్యాసాన్ని తెలుగు చేసి మీకందిస్తున్నాను. చదివి మీ అభిప్రాయాలు తెలియజేయండి. చదవుట కొనసాగించు ‘హెలెన్ కెల్లర్ : నేను సోషలిస్ట్ ను ఎలా అయ్యానంటే…’

“అసుర సంధ్య” నవల మీరు చదివారా?

కొన్ని పుస్తకాలకు నిజానికి విపులమైన పరిచయం అవసరం లేదు. మరెవ్వరూ చెప్పలేన్ని విషయాలు మనకు స్వయంగా పుస్తకాలే తెలియజెప్తాయి. అలాంటి అరుదైన పుస్తకాలలో ఒకటిఅసుర సంధ్య“. అలెక్స్ హేలీ రచించిన పుస్తకానికి తెలుగు అనువాదం ఇంత ఆలస్యంగా వెలువడడం అంతు చిక్కని విషయం. తెలుగు సాహితీ ప్రపంచంలోకి ఇప్పటికైనా వచ్చినందుకు ఆనందంగా ఉన్నప్పటికి ఆలస్యానికి కారణాలు మాత్రం నిజంగా ఆలోచించాలి. అలెక్స్ హేలీ పేరు వినగానే తెలుగు పాఠకులకు సహవాసి పుణ్యమా అని వెంటనే గుర్తుకొచ్చేదిఏడు తరాలునవల. అనితర సాధ్యమైన నవలను రచించిన హేలీ ఇతర రచనల గురించి మనకు మరేమీ తెలియనప్పుడు అత్యంత సాహసంగాయాజ్ఞీ అనే అనువాదకుడు హేలీ మరో రచననుఅసుర సంధ్యపేరుతో మన ముందుకు తీసుకొచ్చారు. చదవుట కొనసాగించు ‘“అసుర సంధ్య” నవల మీరు చదివారా?’

తెలుగు తొలిప్రొద్దు వెలుగులు

Welcome to

తెలుగు తొలిప్రొద్దు వెలుగులు


Blog Stats

  • 1,104 hits

a

 

ఫిబ్రవరి 2010
సో మం బు గు శు
« Feb    
1234567
891011121314
15161718192021
22232425262728

ఉత్తమ టపాలు

  • ఏమీ లేవు

Flickr Photos

Southern Oregon Coast

Untitled

I'd worship the ground you walked on if only you walked in a better neighborhood. (Explore)

More Photos